Dhanwantari Jayanthi

ఓం శ్రీ ధన్వంతరి దేవయే నమః !!
వైద్య నారాయణ ధన్వంతరి మన ధన్వంతరికుల కులానికి ములపురుషులు.
ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని(అనగా దీపావళి కి రెండు రోజులు ముందు) హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించింది. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. ‘ధనూ’ అనగా చికిత్సకు అందని వ్యాధి, ‘అంత’ అనగా నాశము ‘రి’ అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.
ఆశాచ పరమా వ్యాధి తతో ద్వేష: తతో మను: |
తేషాం వినాశినే వైద్యం నారాయణ పరాస్మృతి: ||
ధన్వంతరం అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి ‘ఆశ’ తర్వాత ‘ద్వేషం’ ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి.



నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఇందులో తొలుతగా హాలాహలం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవిలు ఆవిర్భవించారు. అనంతరం ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు. అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే మూలం కావడం విశేషం.

ధన్యవాదాలు
ఇట్లు
మీ
రావులకోల్లు వెంకట్ పండిత్
(ధన్వంతరి పరివార్)

Comments

Post a Comment

Popular posts from this blog

Introduction Of Dhanwantari's

Dhanwantaris telugu Surnames & Gotras

Savita Maharshi Telugu History