Posts

Showing posts from October, 2018

Dhanwantari Jayanthi

Image
ఓం శ్రీ ధన్వంతరి దేవయే నమః !! వైద్య నారాయణ ధన్వంతరి మన ధన్వంతరికుల కులానికి ములపురుషులు. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని(అనగా దీపావళి కి రెండు రోజులు ముందు) హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించింది. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. ‘ధనూ’ అనగా చికిత్సకు అందని వ్యాధి, ‘అంత’ అనగా నాశము ‘రి’ అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆ