About Dhanwantari Pariwar Concept(ధన్వంతరి పరివార్ యొక్క ముఖ్య ఉద్ధేశం)

ధన్వంతరి పరివార్ యొక్క ముఖ్య లక్ష్యం ధన్వంతరి బ్రాహ్మణులు(నాయిబ్రాహ్మణ) కుల చరిత్ర తెలుపుతూ వారిని చైతన్య పరచడం.
About me: నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ 2012 నుండి నాయిబ్రాహ్మణుల చరిత్ర మీద పరిశోధన చేస్తున్నాను. మా నాన్న గారు "సుప్రసిద్ధ నాదోపాసకులు" నాద బ్రహ్మ శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు".
నేను ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణులు) గురించి పూర్తిగా అధ్యయనం చేసి, అనేక గ్రంధాలు చదివి ధన్వంతరి బ్రాహ్మణులే ప్రపంచపు మొట్టమొదటి వైద్యులు మరియు సంగీత విద్వాంసులు అని, వారి కుల దైవం "వైద్య నారాయణ ధన్వంతరి భగవానుడు" వారి ప్రధమ వృత్తి వైద్యం మరియు సంగీతం. క్షౌర వృత్తి వైద్యములో భాగమని, సంగీతానికి కుడా మనమే ఆది పురుషులమని తెలియజేసెను.
నంద రాజులు మరియు మౌర్య రాజులు ధన్వంతరి బ్రాహ్మణ(నాయిబ్రాహ్మణ) కులానికి చెందిన వారు అని 70 గ్రంధలకు పైగా ఆధారాలతో సహ నిరూపించాను. భారతదేశములో నంద రాజుల చరిత్ర గురించి రిసర్చ్ చేసిన మొదటి వ్యక్తులం నేను మరియు నా మిత్రుడు ఆగ్రా వాస్తవ్యులు రంజిత్ నంద. నంద అనే టైటిల్ ప్రతి నాయిబ్రాహ్మణుడు మీ పేరు చివర పెట్టుకోమని భారతదేశం మొత్తం ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తులం మేము.
నా వెబ్ సైట్స్ : http://nandarajavamsam.blogspot.in/
http://vaidyanayeebrahmin.blogspot.in/
http://nadabrahminsamaj.blogspot.com/
నేను మొదటి నుండి నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే "నేను చెసే పనిలో మంచి కనపడాలి కాని, ఆ పని చెసే నేను కనపడనవసరం లేదు" అని నమ్మే వ్యక్తిని.
చివరిగా ఒక మాట అందరు కలసి పోరాడితెనే కులం అభివృద్ధి చెందుతుంది అందరం ఒకటిగా ఉండి కులం అభివృద్ధికోసం పోరాడుదాం.
జై ధన్వంతరి !!
జై నాద బ్రాహ్మణ !!
జై వైద్య బ్రాహ్మణ !!
జై నంద వంశం !!
జై మౌర్య వంశం !!
జై కాలచూరి రాజవంశం !!
జై సేన రాజవంశం !!

Comments

Post a Comment

Popular posts from this blog

Dhanwantaris telugu Surnames & Gotras

List of Doctors

Dhanwantari Jayanthi