Dhanwantari Vaidya brahmins

ధన్వంతరి వైద్య వంశ వృక్షం 

నాయిబ్రాహ్మణులు ప్రపంచపు మొదటి వైద్యులు.విరి కులానికి మూల పురుషుడు "వైద్యనారయణ ధన్వంతరి" 



పురాణముల ప్రకారము "ధన్వంతరి" పుట్టుక :-
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది.ఆ హలాహలం విషపు వాయువుల వలనా దేవాత ముర్తులంత అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయి పడిపోతారు. అప్పుడు ఆ మహవిష్ణువు తన అంశ నుండి "ధన్వంతరి" ని ఉద్భవింప చేస్తాడు.

"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు." అప్పుడు ఆ వైద్యనారాయణ ధన్వంతరి భగవానుడు వైద్యం చేసి దేవతలందరిని ఆరోగ్యవంతులని చేస్తాడు.

వైద్య శాస్త్రాలు ఆవిర్భవన :-
కృతయుగం(లేక)సత్యయుగం, త్రేతాయుగం, ధ్వాపరయుగం, కలియుగం కాలములో "ఆచార్య చరకుడు" 8వ శాతాబ్ధానికి చేందిన వాడు, "ఆచార్య సుశ్ర్తుతుడు 6వ శాతబ్ధానికి చేందిన వాడు.ఆయుర్వేద శాస్త్రానికి చరకుడు వెన్నెముక వంటివాడు,సుశ్రుతుడు గుండెకాయ వంటి వాడు. చరకుడు ప్రపంచపు మొట్టమొదటి వైద్యుడు, సుశ్రుతుడు ప్రపంచపు మొదటి సర్జరి వైద్యుడు. చరకుడు మరియు సుశ్రుతుడు నాయిబ్రాహ్మణ వైద్యుల కులానికి చేందిన వారు.

చరకుడు గురించి:- 
భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.8 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సారాల తరువతా రోగులకు వైద్యం అవసరం కోసం క్షవరం అవసరమైనది, ఆ తరువాత కాలములో కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు"గా మార్పు చెందేరు.చరకుడు కాశ్మీరానికి సంబంధించినవాడు.

సుశ్రుతుడు గురించి:-
సుశ్రుతుడు క్రీ.పూ. 600 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. 
ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది.ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
సుశ్రుతుని కాలములోనే "క్షవర సంప్రదాయం" అభివృద్ధి చేందింది.

క్షవర సాంప్రదాయం :-
వైద్యం అవసరం కోసం క్షవర సాంప్రదాయముని వైద్యులు ప్రవేశ పేట్టారు.ఇప్పటికి చాలా మందికి ఒక అనుమానము "క్షవరానికి" వైద్యానికి సంభందము ఏముంది అని! కాని క్షవరము అనేది ఒక వైద్యము.
పూర్వపు రోజులలో జుట్టువల్ల చాల సమస్యలు వచ్చేవి చుండ్రు, కురుపులు లాంటివి వచ్చి ప్రాణహాని కలిగించేవి.ఇప్పుడున్న ఆధునిక పద్దతులు ఆ రోజులలో లేవు, కనుక వైద్యులు పుర్తిగా గుండు చేసి ఆ కురుపులకి పసరు వైద్యం చేసెవారు.

అంతే కాక ఒక మనిషికి "సర్జరి" చేయాలి అంటే తప్పకుండ అతని శరిరము మీద ఉన్న వేంట్రుకలని తప్పకుండ తోలగించాలి. 
ఉదాహరణ:- ఒక మనిషికి తల పగిలితే అతనికి తప్పకుండా ఆపరేషన్ చేయాలి అలా ఆపరేషన్ చేసి కుట్లు వేయాలు అంటే అతని తల మిద ఉన్న వేంట్రుకలు తప్పకుండ తోలగించవలసిన అవసరము ఉంది.అప్పుడు వైద్యులే క్షవరము చేసి ఆపరేషన్ చేసేవారు.

వైద్యులని సంఘ బహిస్కరణ చేయుట :-
పూర్వపు రోజులలో వైద్య వృత్తి అనేది అపవిత్రమైనది, వైద్యము చేసేవాడు కులహినుడు అని మనుస్మృతిలో కుడా వివరించారు.వైద్యుడు బ్రాహ్మణుడైనప్పటికి వైద్యం చేయడము వలన శూద్రుని గా పరిగనించారు. ఇప్పుడున్నా నాయిబ్రాహ్మణులు ఆ నాటి వైద్య బ్రాహ్మణులే.
ఆనాడు వైద్యులని కులహినులని చేసి అంటరానివారు గా చిత్రికరించి సంఘ బహిస్కరణ చేసేరు.
"మను సం హిత"  (మనుస్మృతి 214 పేజీ, మనుస్మృతి 215వ పేజీ) ప్రకారము వైద్యులని దోంగలుగా, కులం తక్కువ వారుగా చిత్రికరించి కుల బహిస్కరణ చేసేరు.అలాగే రోగాలు వచ్చిన వారు పూర్వ జన్మలో ఎదో పాపము చేయుటవలన ఇ జన్మలో రోగాల రూపములో అనుబవిస్తున్నారు అలంటి వారికి వైద్యము చేయుట తగదు అని చరకుని సమయములో కుడా అనేవారు. "పూర్వ జన్మార్జితం పాపం వ్యాధిరూపేణ జాయితే" (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి). కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు.

బార్బర్ సర్జన్స్:-
ఆధునిక సమాజంలో కుడా బార్బర్ లే ప్రపంచలు మొట్టమొదటి వైద్యులు అని చారిత్రక ఆధారాలు చేప్తున్నాయి.
లండన్, బ్రిటన్,ఈజిప్ట్ లాంటి దేశాలలో బార్బర్స్ ఏ ప్రపంచపు మొదటి వైద్యులు అని వారు పేర్కోన్నారు.
లండన్ కి చేందిన వారు బార్బర్ సర్జన్స్ కి గుర్తుగా  Worshipful Company of Barbers" ని స్తాపించారు.
ప్రస్తూతం డాక్టర్లు వారి క్వాలిఫ్కేషన్ గుర్తుగా హస్పిటల్స్ మీద మరియు వారి వాహనాల మీద ఎరుపు రంగులో(Red Colour) లో ప్లస్(+) గుర్తు వేసుకుంటారు..
కాని ఎరుపు రంగు ప్లస్ గుర్తు బార్బర్ సర్జన్స్(barber surgeons) కి గుర్తు..
అందుకే ఇప్పుడు కుడ బార్బర్ షాప్స్ కి ఎరుపు కలర్ ని వారి పనికి గుర్తుగా పెడతారు..
ఒకసరి ఆ పై ఫోటో మద్యలో లో ఉన్న ఎరుపు రంగు ప్లస్(+) గుర్తుని చుస్తే మికే అర్దం అవుతుంది, ఆ గుర్తు బార్బర్ సర్జన్స్ కి చిహ్నం..

బెంగాల్ బైద్య బ్రాహ్మణులు:- 
బెంగాల్ బైద్య బ్రాహ్మణులు మన తెలుగు నాయిబ్రాహ్మణులే. ప్రముఖచరిత్రక వేత్త "బిజయ చంద్ర మజుందర్ " ఆయన వ్రాసిన గ్రంధలలో వివరించారు బైద్య"(వైద్య)" లు దక్షిణ బారతదేశాములోని "వెల్లాల్"అనే గ్రామాము నుండి తరలి వెల్లినారు విరిని వెల్లాల్ వైద్యులుఅనేవారు అని రాసినారు. వెల్లాల్ గ్రామాము ఆంధ్రప్రదేశ్  కడపజిల్లలోనిది.

హౌస్ ఆఫ్ కామన్స్ :
1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలోఅమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ “మంగలి వైద్యుడు” ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని “హౌస్ ఆఫ్ కామన్స్” లో ప్రవేశపెట్టాడు. 

1.భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.

2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది. మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి. 

ప్రముఖ నాయిబ్రాహ్మణ(వైద్యులు):-
1. DR.జి.ఎతి రాజులు - ఆంధ్రప్రదేశ్ మొదటి ORTHOPEDIC వైద్యుడు

2. DR.రాల్లపాటి అరవింద్ - ఆంధ్రప్రదేశ్ మొదటి GYNECOLOGIST వైద్యుడు.

3. DR.జె.నరేష్  - ఆంధ్రప్రదేశ్ లో FNB(వెన్నుముక సర్జరి) చేయటములో మొదట అర్హత కలిగినవాడు, లంబర్ స్పైన్(వెన్నుముక) పై అధ్యనము చేసే అంతర్జాతీయ సంఘములో భాతరదేశము నుండి ఇద్దరి వైద్యులకి మాత్రమే సభ్యత్వం లబించినది అందులో ఒకరు మన రమేష్ గారు.

(ధన్వంతరి పరివార్)

Comments

Popular posts from this blog

Introduction Of Dhanwantari's

Dhanwantaris telugu Surnames & Gotras

List of Doctors